వేసవిలో ఫ్రిజ్‌ను ఇలా ఉపయోగించండి...

ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (10:13 IST)
ఫ్రిజ్‌లో పదార్థాలు భద్రపరచుకోవడానికి మాత్రమే అనుకుంటారు చాలా మంది. ఫ్రిజ్ నిర్వహణ విషయంలో చాలా విషయాలు తెలుసుకోవాలి. ఫ్రిజ్‌ అరల్లో పదార్థాలను ఎలా పడితే అలా పెట్టకూడదు. 
 
వెనుక భాగంలో ఎక్కువ చల్లగా ఉంటుంది, ముందు భాగంలో తక్కువగా ఉంటుంది. మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలనుకునేవీ, త్వరగా పాడవుతాయి అనుకున్నవి మాత్రమే వెనుక భాగంలో పెట్టాలి. మామూలుగా చల్లదనం చాలు అనుకున్నవి ముందు పెట్టుకుంటే సరిపోతుంది. 
 
ఫ్రిజ్‌ అరల్లో ప్లాస్టిక్‌ షీట్లు వేయడం మంచిది. అలా వేసుకోవడం వలన గ్లాసు త్వరగా పాడవదు. పదార్థాల మీద మరకలు పడవు. మనం రోజూ ఉపయోగించే పచ్చిమిర్చి, కరివేపాకును కనిపించే డబ్బాలో పెడితే బయటకు కనిపిస్తాయి. మనము వెతుక్కోవాల్సిన ఇబ్బంది ఉండదు. 
 
చాలామంది కూరగాయ ముక్కలు, పండ్ల ముక్కలు వంటివి మూతలు ఉన్నా డబ్బాలో పెడుతుంటారు. అలా చేయడం వలన ఎక్కువ స్థలం వృథా అవుతుంది. థర్మోకోల్‌తో చేసిన ప్లేట్లు లేదా మందంగా ఉన్న టిఫిన్‌ ప్లేట్లలో ఉంచి కవరుతో ప్యాక్‌ చేసుకోవాలి. 
 
ఇలా చేయడం వల్ల బయటకు కనిపిస్తాయి, తాజాగానూ ఉంటాయి. ఫ్రిజ్‌ దుర్వాసన రాకుండా ఉండాలంటే వంటసోడాను కప్పులో తీసుకుని ఫ్రిజ్‌లో ఓ మూల ఉంచితే వాసన రాకుండా ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు