నీరు తాగకపోతే.. బరువు పెరిగిపోతారు. ఒబిసిటీ తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు. నీళ్లు తాగనందువల్ల శరీరం తనకున్న ప్రతి నీటి చుక్కనీ దాచుకోవడం మొదలుపెడుతుంది. దాంతో శరీరం బరువు పెరుగుతుంది. వినడానికి కాస్త కొత్తైనప్పటికీ ఇది నిజమేనని వైద్యులు చెప్తున్నారు. అలాగే టీ, కాపీలు తీసుకోవడం మానేసి.. నీటిని తీసుకోవడం ద్వారా శరీరం తేమగా మారుతుంది. ఎందుకంటే? శరీరం డీహైడ్రేషన్‌కి గురయినప్పుడు శక్తి తగ్గిపోతుంది.
శరీరంలో నీరు తక్కువైతే ఏకాగ్రత కుదరదు. మనం తీసుకునే నీళ్లల్లో ఎనభైశాతం వరకూ మెదడు సామర్థ్యం, దాని పనితీరు ఆధారపడి ఉంటాయి. అందుకే ఒత్తిడిగా ఉన్నప్పుడు తగినని నీళ్లు తీసుకోగలిగితే మానసిక సామర్థ్యం పెరుగుతుందని అధ్యయనాలు తేల్చాయి.