సొరకాయ జ్యూస్‌ను తీసుకుంటే..?

సోమవారం, 11 మే 2020 (20:39 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌. దీనికి వ్యాక్సిన్ లేదు. అందుచేత రోజువారీ డైట్‌లో వ్యాధినిరోధక శక్తిని పెంపొందించే ఆహారాన్ని వుండేలా చూసుకోవాలి. బత్తాయి, నారింజ, నిమ్మపండు, ఉసిరికాయను ఆహారంలో తప్పకుండా తీసుకోవాలి. గ్రీన్‌టీతో రోజును ప్రారంభిస్తే మంచిది. ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చేపలు, అవిసెగింజలను ఆహారంలో భాగం చేసుకునే ప్రయత్నం చేయాలి. అరగంటకు ఓసారి గ్లాసుడు నీటిని సేవించాలి. 
 
నీటి శాతం ఎక్కువగా వున్న కూరగాయలు తీసుకోవాలి. ముఖ్యంగా సొరకాయను ఆహారంలో చేర్చుకోవాలి. ఇందులో పిండిపదార్థాలు తక్కువగా ఉంటాయి కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్థులు తీసుకోవచ్చు. దీంట్లో ఉండే 90 శాతం నీరు అధిక దాహాన్ని, వేడిని తగ్గిస్తుంది. కాబట్టి వేసవిలో ఈ జ్యూస్‌ను తాగొచ్చు. ఎసిడిటీ నివారణకు ఇది తోడ్పడుతుంది. 
 
సొరకాయ రసాన్ని తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. ఇందులో సోడియం చాలా తక్కువగా ఉండటం వల్ల అధిక రక్తపోటు, హృదయ సంబంధ సమస్యలతో బాధపడేవాళ్లకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇంకా రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చేస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు