ఫలితంగా జర్మనీ, ఫ్రాన్స్‌ను కూడా దాటేసి ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదైన దేశాల్లో అయిదో స్థానానికి ఎగబాకింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదవుతున్న రష్యాలో ఇప్పటిదాకా 221,344 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 2,009కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11,656 కేసులు నమోదయ్యాయి.
ఇకపోతే.. రష్యా రాజధాని మాస్కోలో పరిస్థితి దారుణంగా ఉంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసులు, మరణాలలో సగం వరకు ఇక్కడ నుంచే ఉండడం ఆందోళన కలిగించే విషయం. సోమవారం రోజున కొత్తగా 6,169 కేసులు పెరిగాయి. దీంతో అధికారిక లెక్కల ప్రకారం మాస్కోలో కేసల సంఖ్య 1,15,909 కు చేరుకుంది. దీంతో రష్యా ఇప్పుడు బ్రిటన్, ఇటలీలను దాటేసి మూడో స్థానాన్ని ఆక్రమించింది.