సొరకాయను వేసవిలో వాడటం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో సోడియం చాలా తక్కువగా ఉండటం వల్ల అధిక రక్తపోటు, హృదయ సంబంధ సమస్యలతో బాధపడేవాళ్లకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. పిండి పదార్థాలు ఇందులో వుండటం ద్వారా మధుమేహాన్ని దూరం చేస్తాయి. సొరకాయను తీసుకోవడం ద్వారా రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చేస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సాయపడుతుంది.
కాబట్టి అధిక బరువుతో బాధపడేవాళ్లు నిరభ్యంతరంగా దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. దీంట్లో ఉండే 90 శాతం నీరు అధిక దాహాన్ని, వేడిని తగ్గిస్తుంది. కాబట్టి వేసవిలో ఈ జ్యూస్‌ను తాగొచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.