గోధుమ రంగు బియ్యం లేదంటే బ్రౌన్ రైస్. ఈ బియ్యంతో చేసే వంటకాలను షుగర్ పేషెంట్లు వారానికి రెండుసార్లైనా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బ్రౌన్ రైస్ శరీరంలో షుగర్ తగ్గిస్తుంది. ఇందులో ఐరన్, విటమిన్ బీ3, బీ1, బీ6లు ఉన్నాయి. ఒక కప్పు బ్రౌన్ రైస్‌లో దాదాపు 21 శాతం మెగ్నీషియం దొరుకుతుంది. బ్రౌన్ రైస్‌లోని పీచు జీర్ణవాహికలోని కేన్సర్ రసాయనాలను బయటకు పంపుతుంది. బ్రౌన్ రైస్‌లోని సెలీనియం కూడా ఉబ్బసానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది.
బ్రౌన్ రైస్‌లో బి కాంప్లెక్స్ ఎక్కువ. థైమిన్, రైబోప్లేవిన్ అనే విటమిన్లు కూడా వుంటాయి. ఇవి నరాలకు శక్తినిస్తాయి. బ్రౌన్‌రైస్ ఊకలో లభ్యమయ్యే నూనె కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దీనిలో ఉండే పీచు కూడా ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
బ్రౌన్ రైస్‌లోని మెగ్నీషియం శరీరంలో ఎనర్జీ లెవల్స్‌ను పెంచుతుంది. మెగ్నీషియం, విటమిన్ డితో ఎముకలకు బలాన్నిస్తుంది. బ్రౌన్ రైస్ కోలన్, బ్రెస్ట్ క్యాన్సర్లను దరిచేరనివ్వదు. హృద్రోగ సమస్యలను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.