ముఖ్యంగా మజ్జిగలో నిమ్మరసం కలుపుకొని తాగితే ఎండదెబ్బ తాకే ప్రమాదం ఉండదు. దాంతో పాటు వేసవి తాపం కూడా తీరుతుంది. డీహైడ్రేషన్ కాకుండా ఉంటారు. మజ్జిగలో ప్రొటీన్స్, మినరల్స్ లాంటి ఖనిజాలు ఉంటాయి. అవి చాలా ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి.
అంతే కాదు.. కాల్షియం లోపంతో బాధ పడేవాళ్లు మజ్జిగను తాగితే వాళ్ల ఎముకలు, దంతాలు కూడా దృఢపడతాయి. రోజూ మజ్జిగను తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గ్యాస్, అజీర్తి సమస్యలతో బాధపడేవాళ్లు కూడా మజ్జిగను రోజూ తాగొచ్చు. ముఖ్యంగా ఊబకాయంతో సతమతమయ్యేవారు ప్రతి రోజు మజ్జిగను సేవిస్తుంటే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.