శెనగల పిండితో ధనియాలు కలుపుకుని సూప్‌గా తీసుకుంటే?

మంగళవారం, 2 జులై 2019 (18:21 IST)
మనం తినే పలు రకాల దినుసులలో శెనగలు ఒకటి. సాధారణంగా ఇవి రెండు రకాలుగా వర్గీకరించబడ్డాయి. దేశీ శెనగలు నలుపు, ఎరుపు, పసుపు పచ్చ, ఆకు పచ్చ, మట్టి రంగులో లభ్యమవుతాయి.


ఇకపోతే కాబూలీ శెనగలు పెద్దవిగానూ కొద్దిగా తెల్ల రంగులో ఉంటాయి. శెనగలు మన ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. ఈ శెనగలు ఎండబెట్టి తీసుకోవడం వలన రక్తస్రావాలను అరికడుతుంది. 
 
శెనగలతో తయారుచేసిన సూప్‌ను తరుచుగా తీసుకుంటే శరీరంలో వేడిని తగ్గిస్తుంది. శెనగ పిండిలో చేదు పొట్ల ఆకులను చేర్చి చేసిన సూప్‌ను తీసుకోవడం వలన కడుపు నొప్పి, కడుపులోని అల్సర్‌ను తగ్గిస్తుంది. శెనగల పిండిలో ధనియాలు కలుపుకుని సూప్‌గా తయారుచేసుకుని తీసుకుంటే వాంతులు వంటి సమస్యలు తొలగిపోతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు