చెర్రీ పండ్లలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అందుకే వీటికి చాలా ప్రాముఖ్యతనిస్తుంటారు వైద్యులు. అనేక రుగ్మతలను పారదోలడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. పుల్లని చెర్రీలు ఒక 'ఆస్పిరిన్' టాబ్లెట్ కంటె పదిరెట్లు ఎక్కువ ఉపశమనం కలిగిస్తాయి.
నొప్పి, మంటల నివారణలో...
కడుపు మంట, కురుపులు వంటివి నయం చేసే శక్తి వీటికి వుంటుంది. టైప్-2 డయాబెటిస్,గుండె వ్యాధులకు దారితీసే ఇన్‌ఫ్లమేషన్‌ను నివారించటంలో చెర్రీ చాలా ఉపయోగకారిగా ఉంటుంది. బాధ నివారణలో చెర్రీలు నమ్మకంగా పనిచేసే ఉపశమనాలు. రోజువారీ పనులు పూర్తయ్యాక కలిగే కండరాల నొప్పులు, ఆస్టియో ఆర్ధరైటిస్,రుమరాయిడ్ ఆర్థరైటిస్‌లకు కూడా ఇది మంచి ఔషదం. నిజానికి పుల్లని చెర్రీలు ఒక 'ఆస్పిరిన్' టాబ్లెట్ కంటె పదిరెట్లు ఎక్కువ ఉపశమనం కలిగిస్తాయి. కొన్ని అల్లోపతి మందుల వలె కడుపు మంట, విటమిన్‌ల లోపాన్ని కూడా కలిగించకుండా బాధను చక్కగా నివారిస్తాయి చెర్రీలు.
ఆహారంగా చెర్రీలు...
చెర్రీలలో కొవ్వు తక్కువ, నీటి శాతం ఎక్కువ, క్యాలరీలు చాలా తక్కువ. శరీరంలో శక్తిని పెంచి మెటబాలిజం అనే జీవక్రియను పెంచే నీరు అధిక శాతం ఉండే చెర్రీలు ఎక్కువ నీటిని శరీరానికి అందిస్తాయి. స్థూలకాయం తగ్గించుకోవడానికి నేడు తమ ఆహారంలో ఎందరో చెర్రీలను జోడిస్తున్నారు.
క్యాన్సర్ నిరోధానికి...
చెర్రీలోని 'యాంథోసియానిన్'లు ట్యూమర్ పెరుగుదలను, క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. 'పెరిలైల్' ఆల్కహాల్ అనే మరొక ఫైటో న్యూట్రియెంట్ క్యాన్సర్ కణాలకు రక్త సరఫరాను నిలిపివేసి వాటిని చంపేస్తుంది. అందువల్ల కార్సినోజన్ బాడీలు నిర్మూలనమౌతాయి.
నిద్రకు రక్షణ...
అలసట, నిద్రలేమికి లోనయ్యే ప్రయాణికులకు వైద్యులు 'మెలటోనిన్' మాత్రలు ఇస్తారు. ఇవి జీవలయ, నిద్రా రీతులను క్రమబద్ధం చేస్తాయి. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఎండబెట్టినవి, ఫ్రీజ్ చేసినవి, జ్యూస్ రూపాలలో తీసుకునే చెర్రీలలో మెలటోనిన్ అధిక స్థాయిలో ఉంటుంది. విమానాలలో అధిక దూరాలు ప్రయాణం చేసేవారు నిద్రపోవటానికి ఒక గంట ముందుగా ఎండబెట్టిన చెర్రీలను తింటే మంచిదని వైద్యశాస్త్రజ్ఞుల సలహా. గమ్యం చేరుకున్నాక కూడా నిద్రకు గంట ముందు వరుసగా మూడు రాత్రులు తినటం మంచిది.
ఎలా కావాలంటే అలా
అసలింతకీ చెర్రీలను వాడటం ఎలా అని వర్రీ అయిపోతున్నారా. ఇక్కడ కొన్ని చిట్కాలున్నాయి. చూడండి...
*జిమ్‌కు వెళ్ళేటప్పుడు ఒక బాటిల్ చెర్రీజ్యూస్‌ను వెంట తీసుకుని వెళ్ళండి. బాగా అలసి పోయేలా వ్యాయామం చేసిన తరువాత చేర్రీ జ్యూస్ తాగితే ఇక కండరాల నొప్పులు మీ నుండి పరుగెడతాయి.
*బ్రేక్‌ఫాస్ట్ ఆహార పదార్థాలలో కొన్ని ఎండిన చెర్రీలు కలిపితే ఆరోగ్యానికి మంచిది.
*కొవ్వు తక్కువుగా ఉండే ఫలహారం కావాలా? కొన్ని ఫ్రోజెన్ చెర్రీలను నూరి యొగర్ట్(గింజలు ఎండిన పళ్ళ మిశ్రమం)పై ఒక పొరలా పేరిస్తే అప్పుడు దాన్ని రుచికరంగా సేవించవచ్చు.