అధిక కొవ్వు తగ్గించడంలో ఉల్లిపాయలు మంచి మందులా పనిచేస్తాయి. అందుకే ఉల్లిపాయలు రోజువారి ఆహారంలో తప్పక చేర్చుకునేలా చూడాలి. అలాగే కొవ్వు కరగాలంటే.. పండ్లలో యాపిల్‌ను డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులోని పొటాషియం, ఫాస్పరస్ చాలా మేలు చేస్తుంది.
ఇకపోతే.. గుండెకు అవసరమయ్యే ఫైబర్, విటమిన్స్, మినరల్స్ గోధుమలో పుష్కలంగా లభిస్తాయి. ఇది గుండెకు హాని కలిగించే కొవ్వుని నివారిస్తుంది. ఫైబర్ కొవ్వుతో కలిసి దానిని బయటికి పంపేందుకు పనిచేస్తుంది. ఇంకా ఫైబర్ దొరికే పదార్థాలలో ఓట్స్, బార్లీ, రాగి, జొన్న వంటివి ముఖ్యమైనవి. వీటిని వారానికి మూడుసార్లు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు చెప్తున్నారు.