గుమ్మడికాయ విత్తనాలలో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. గ్యాస్ట్రికి, ప్రోస్టేట్, బ్రెస్ట్, లంగ్, కోలన్ క్యాన్సర్స్ వ్యాధుల నుండి విముక్తి కలిగిస్తుంది. మహిళలు గుమ్మడికాయ విత్తానాలను తరచుగా తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. గుమ్మడికాయ విత్తనాలు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. హైబీపిని తగ్గిస్తాయి.
ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చేస్తాయి. దీంతో హార్ట్ ఎటాక్స్ రాకుండా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు గుమ్మడికాయ విత్తనాలు ఎంతో మేలు చేస్తాయి. వాటిని తినడం వలన రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ అదుపులో ఉంచుతుంది. వయస్సు మీద పడడం కారణంగా వచ్చే ముడతలు తగ్గాలంటే గుమ్మడికాయ విత్తనాలను తినాలి.
వీటిల్లో ఉండే ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు చర్మ సౌందర్యాన్ని పదిలంగా ఉంచుతాయి. చర్మాన్ని రక్షిస్తాయి. దీంతో చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. కాంతివంతంగా, మృదువుగా కూడా మారుతుంది. నేటి తరుణంలో చాలా మందికి వెంట్రుకలు రాలిపోతున్నాయి.