పీరియడ్స్ నొప్పికి దివ్యౌషధం.. ధనియాల పొడి.. ఇలా వాడితే..?

శుక్రవారం, 12 మార్చి 2021 (18:44 IST)
ధనియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మధుమేహం నియంత్రణ, కొలెస్ట్రాల్‌ని నియంత్రణలో ధనియాల పొడి మెరుగ్గా పనిచేస్తుంది. ధనియాలని గ్రైండ్ చేసి ఒక గ్లాసు నీళ్లకు చేర్చి మరిగించి చల్లారిన తరువాత వడగట్టి తాగితే కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. పీరియడ్స్ సమయంలో ఆరు గ్రాముల ధనియాలను ఒక అర లీటర్ నీళ్లకు కలిపి సగం నీళ్లు మాత్రం మిగిలేంత వరకూ మరిగించాలి.
 
ఈ మిశ్రమంలో పటిక బెల్లం చేర్చి గోరు వెచ్చగా ఉన్నప్పుడే తీసుకోండి. ఇలా మూడు నాలుగు రోజుల పాటు చేస్తే పీరియడ్స్ సమయం లో రక్తస్రావం ఆధిక్యత తగ్గుతుంది. పైగా పీరియడ్స్ సరిగ్గా సమయానికి వస్తాయి.
 
ధనియాలు ఏ రూపంలో తీసుకున్నా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి ఇస్తాయి. దీని కారణంగా ఫ్రీరాడికల్స్‌ను ఎదుర్కోవడానికి బాగా సహాయ పడుతాయి. 
 
కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా ధనియాలు ఉపయోగపడతాయి. ధనియాల పొడి మచ్చలను నివారిస్తుంది. ధనియాల పొడిలో పసుపు వేసి పేస్ట్ లాగ చేసి ముఖానికి పట్టించి ఉంచితే మంచి ఫలితం కనబడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు