ఈ ఎన్నికల్లో భాగంగా, మంత్రి ఆళ్ళ నాని తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏలూరులోని శనివరపుపేటలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి రాగా, ఓటర్ల జాబితాలో తన పేరు లేదని తెలుసుకుని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా తయారీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆరోపించారు.
కాగా, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు పోలింగ్ నిర్వహించాలని మంగళవారం హైకోర్టు ఆదేశించిన విషయం తెల్సిందే. అయితే, ఎన్నికలు నిర్వహించినప్పటికీ... ఫలితాలను మాత్రం తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు వెల్లడించవద్దని ఆదేశించింది.