కరోనా వేళ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. లేకపోతే తరచుగా జలుబు, జ్వరం, అలసట, ఎలర్జీల బారిన పడే అవకాశం ఉంది. అందుకే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు. ఇందులో భాగంగా ప్రతిరోజూ ఒక కప్పు తాజా పెరుగును తీసుకోవాలి. ఇది జీర్ణాశయంలో ఉండే బాక్టీరియాను నిర్మూలిస్తుంది.
అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల వైరస్‌పై పోరాడి ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. టమాట, బంగాళదుంప వంటి కూరగాయల్లో, నారింజ, నిమ్మ, కమలా, కివి పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ప్రతిరోజు అరకప్పు తాజా క్యారెట్‌ను తినాలి. దీనిలో ఉండే బీటా కెరోటిన్, విటమిన్ బి6లు యాంటీ బాడీ కణాలు ఉత్పత్తిని ఉత్తేజ పరుస్తాయి.