వివరాల్లోకి వెళితే.. జైపూర్ జిల్లా షాపురా వద్ద ఢిల్లీ - జైపూర్ జాతీయ రహదారిపై ఓ వ్యక్తి ప్రమాదంలో చనిపోయిన కుక్కను తింటూ ఆకలి తీర్చుకుంటూ కనిపించాడు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు దీన్ని గమనించారు. బాధితుడిని ప్రద్యుమ్న సింగ్ నరూకా అనే వ్యక్తి.. దీన్ని ఎందుకు తింటున్నావని ప్రశ్నించాడు. తినడానికి తిండి లేదని, ఆకలి తట్టుకోలేక ఇలా చేస్తున్నట్టు చెప్పాడు. వెంటనే తన వాహనంలో ఉన్న ఆహారం ప్యాకెట్‌ను ఇచ్చి అతడి ఆకలి తీర్చాడు. మరోసారి ఇలా కళేబరాన్ని తినకూడదని సూచించాడు.