కీరదోసలోని యాంటీఆక్సిడెంట్స్ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. కీరదోస ముఖ్యంగా మహిళల్లో రొమ్ముక్యాన్సర్లు, పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్లను నివారిస్తుంది. కీరదోస శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపుతుంది. కాలేయాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. మూత్రపిండాలపై పడే అదనపు భారాన్ని తొలగిస్తుంది. రక్తంలోని కొలెస్ట్రాల్ పాళ్లను అదుపులో ఉంచి, గుండెజబ్బులను నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.