అత్యుత్తమమైన, లాభం చేకూర్చే బ్యాక్టీరియా పెరుగు ద్వారా లభిస్తుంది. ఇవి శరీరానికి పలు రకాలుగా లాభాలను చేకూరుస్తాయి. ఉదరంలోని పేగులకు అత్యుత్తమమైన బ్యాక్టీరియా అందకపోతే ఉదర సంబంధమైన పలు జబ్బులు వెంటాడుతాయి. ఇందులో ప్రధానంగా ఆకలి వేయకపోవడం, అల్సర్, కడుపునొప్పి తదితర జబ్బులకు కేంద్ర బిందువు ఉదరమేనంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.
దీంతో యాంటీబయోటిక్ థెరపీ సందర్భంగా భోజనం ద్వారా తీసుకునే విటమిన్లు, ఖనిజాలు సరిగా జీర్ణం కావు. ఇలాంటి సమయంలో పెరుగు తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. పెరుగు తీసుకోవడం వలన జీర్ణక్రియ సక్రమంగా పని చేస్తుంది. దీంతో ఉదరంలో తలెత్తే ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చంటున్నారు వైద్యులు. పెరుగు తీసుకోవడం వలన శరీరానికి అందవలసిన పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి. దీంతోపాటు శరీర చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
తెల్ల రక్త కణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. వయసు పెరిగే కొద్దీ మనిషి పెరుగును తీసుకుంటుండాలి. దీంతో వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే చాలాకాలంగా పలు జబ్బులతో బాధపడే వారు తప్పనిసరిగా పెరుగును తీసుకోవాలి. పెరుగు తీసుకోవడం వలన వారి ఆరోగ్యానికి చాలా మంచిది. యాంటీబయోటిక్ థెరపీ ఇచ్చే సందర్భంలో నియమానుసారం పెరుగు తీసుకోవాలని డైటీషియన్లు సూచిస్తుంటారు.