కరివేపాకును మజ్జిగలో కలుపుకుని తాగితే? (Video)

సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (11:33 IST)
కరివేపాకులను పరగడుపున నమిలి తింటే.. జీర్ణక్రియ మెరుగవుతుంది. పరగడుపున కరివేపాకును నమలడం ద్వారా జీర్ణవ్యవస్థలోని ఎంజైమ్స్‌ని క్రమబద్ధం చేస్తాయి. కిడ్నీ సంబంధిత సమస్యలుండవు. బరువు తగ్గాలంటే కరివేపాకుల్ని తినాలి. ఇవి శరీరంలో చెడు వ్యర్థాల్ని బయటకు నెట్టేస్తాయి.

కరివేపాకులకూ కంటిచూపుకీ సంబంధం ఉంటుంది. ఎంత ఎక్కువగా కరివేపాకుల్ని తింటే... కంటి చూపు అంత ఎక్కువగా మెరుగవుతుంది. ముఖ్యంగా స్కూల్‌కి వెళ్లే పిల్లల క్యారేజీ కూరల్లో తప్పనిసరిగా కరివేపాకు పొడి వుండేలా చూసుకుంటే మంచి ఫలితం వుంటుంది. 
 
భోజనంలో కలిపిన కరివేపాకు ఆకులను తినటానికి ఇష్టపడకపోతే, రోజుకు రెండు సార్లు కరివేపాకు రసాన్ని తాగటం వలన కూడా మూత్రపిండ సమస్యలు తగ్గే అవకాశం ఉందంటున్నారు. మూత్రపిండాలలో రాళ్లు కలిగి ఉండే వారు కూడా కరివేపాకు రసాన్ని తాగితే మంచి ఫలితం వుంటుంది.
 
కరివేపాకు ఆకులను నులిమి, మజ్జిగలో లేదా నీటిలో కలుపుకొని తాగటం వలన అజీర్ణం నుండి ఉపశమనం పొందుతారు. కరివేపాకు ఆకులను ఎండబెట్టి లేదా వేయించి, పొడి చేసి రోజు రెండు చెంచాలు తీసుకోవటం వలన జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు