విడాకులు తీసుకునే మహిళల్లో గుండెపోటు అధికమా?

శనివారం, 8 సెప్టెంబరు 2018 (14:52 IST)
ఇటీవలి కాలంలో గుండెపోటుకు గురయ్యేవారి సంఖ్య ఎక్కువైపోతోంది. అలాగే విడాకులు తీసుకునే మహిళల్లో గుండెపోటు సమస్య ఎక్కువగా ఉన్నట్టు అమెరికా శాస్త్రవేత్తలు ఓ అధ్యయనంలో కనుగొన్నారు.
 
వాషింగ్టన్ డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకునే మహిళల్లో గుండెపోటు సమస్య అధికంగా ఉన్నట్టు తెలిపారు. 
 
మహిళల జీవితాల్లో విడాకులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేస్తాయని, తద్వారా వారు గుండెపోటుకు గురవుతున్నట్టు పేర్కొన్నారు. ఈ విడాకులు పురుషుల్లో కూడా మానసిక ఒత్తిడి పెంచుతుందని వారు వెల్లడించారు. 
 
ఈ సమస్య ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళల్లో ఉన్నట్టు తెలిపారు. అయితే, ఇతర దేశాలతో పోల్చింతే.. భారత్‌లో అధికంగా ఉన్నాయనీ, మానసిక ఒత్తిడితో పాటు.. సామాజిక సమస్యలు కూడా వారిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు