అల్యూమినియం పాత్రల్ని అస్సలు వాడకూడదట.. (video)

మంగళవారం, 12 నవంబరు 2019 (14:15 IST)
అవును అల్యూమినియం పాత్రల్ని అస్సలు వాడకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జీవితాన్ని వేధించే వ్యాధులకు కారణం అల్యూమినియం పాత్రలను వాడటమేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

షుగర్, కీళ్ళ నొప్పులు, లివర్ వ్యాదులు, కిడ్ని సమస్యలు, గుండె సమస్యలు మన దేశంలో అనూహ్యంగా పెరిగిపోయాయి. వీటిల్లో అల్యూమినియం పాత్రల పాత్రే ఎక్కువగా ఉండటమేనని తాజా అధ్యయనంలో తేలింది. 
 
ఇందుకు కారణాలు లేకపోలేదు. సుమారుగా వందేళ్ల క్రితం భారత దేశ స్వతంత్ర పోరాట యోధులను అనారోగ్యం పాలు చేయడానికిగానూ, వాళ్లను బంధించి వుంచిన జైళ్లల్లో అల్యూమినియం పాత్రలను ప్రవేశపెట్టారు.

ఈ పాత్రలలో వంటచేసినా, వండినదానిని నిలువ చేసినా ఆ పదార్థాలు క్రమక్రమంగా విషతుల్యం.. స్లో పాయిజన్ అవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
అల్యూమినియం పాత్రల్లో తింటే క్రమంగా బి.పి., షుగర్, కీళ్ళనొప్పులు, కాలేయ సమస్యలు, రకరకాల కాన్సర్‌లు మొదలవుతాయట. స్వతంత్ర సమరయోధులను అనేక జబ్బుల బారిన పడేలా చేసి వారిని నిర్వీర్యం చేయడానికి గానూ ఈ పాత్రలను అప్పట్లో వాడే వారని తెలిసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు