బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేయడం వల్ల కలిగే నష్టాలేమిటో తెలుసా?

బుధవారం, 28 అక్టోబరు 2020 (17:13 IST)
మనం ప్రతి రోజు తీసుకునే అల్పాహారం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటి ప్రాధాన్యత తెలియకుండా కొంత మంది స్కిప్ చేస్తుంటారు. నేరుగా లంచ్ చేద్దామని కొంతమంది అల్పహారాన్ని మానేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మనలో ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని అది తగ్గిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
 
రాత్రి భోజనం చేశాక ఉదయం నిద్ర లేచే వరకు 12 గంటలు గ్యాప్ ఉంటుంది. ఇలాంటి సమయంలో మన శరీరానికి తగిన పోషకాలు అవసరం. శరీరం, మనస్సు యాక్టివ్‌గా ఉండాలంటే క్యాలరీలు అవసరమవుతాయి. అదేవిధంగా తగిన మోతాదుల్లో పిండిపదార్థాలు అవసరం. వీటిని మనం రోజూ ఉదయం తినే అల్పహారం భర్తీ చేస్తుంది.
 
మనం తినే అల్పాహారంలో మాంసకృత్తులు, పోషకాలు ఉండేలా చూసుకోవాలి. సరిగ్గా అల్పాహారం తీసుకోకపోవడం వలన నీరసానికి గురవుతారు. అందుకే తప్పనిసరిగా అల్పహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు