ఖాళీ కడుపుతో పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా? (video)

సోమవారం, 27 జులై 2020 (23:22 IST)
చాలామంది తమ పిల్లలకి లేగానే ముఖం కడుక్కుని పాలు తాగాని ఒత్తిడి చేస్తుంటారు. కానీ చాలామంది నిపుణులు చెప్పే మాట ఏమిటంటే...  ఖాళీ కడుపుతో పాలు తాగకూడదని. పాలు చాలా భారీ పానీయం. పరగడుపున పాలు తాగటం వల్ల కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది.
 
గ్యాస్ట్రిక్ సమస్యలు లేదా జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతుంటే పాలుని ఖాళీ కడుపుతో తాగకూడదు. పెరుగు లేదా పులియబెట్టిన పాల ఉత్పత్తులను ఖాళీ కడుపుతో తినడం మంచిది కాదు. హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఇది ఈ పాల ఉత్పత్తులలో ఉన్న లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాను చంపుతుంది.
 
ఇది ఆమ్లతకు కారణమవుతుంది. పురాతన భారతీయ హీలింగ్ థెరపీ ఆయుర్వేదం కూడా ఉదయం పాలు తాగడం మానేయాలని చెప్పారు. వాస్తవానికి, పిల్లలు కూడా ఖాళీ కడుపుతో పాలు తాగరాదని ఇది సూచించింది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు