తమలపాకు వేసుకుంటే దగ్గు, ఆస్తమా తగ్గుతాయా?

మంగళవారం, 10 అక్టోబరు 2023 (22:05 IST)
తమలపాకులు. వీటిని తీసుకుంటే ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. రాత్రిపూట తమలపాకులను బాగా కడిగి ఆ తర్వాత వాటిని నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది. తమలపాకు ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తమలపాకుల్లో కొద్దిగా ఉప్పు, జీలకర్ర కలిపి తింటే అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది. తమలపాకు రసంతో వాము కలిపి తింటే ఎముకలకు బలం చేకూరుతుంది.
 
తమలపాకు రసంలో కొద్దిగా సున్నం కలిపి తీసుకుంటే గొంతు సమస్య తగ్గుతుంది. తమలపాకుల్లో ఐరన్, ఫైబర్, కాల్షియం, థయామిన్, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ ఎ, సి వంటివి ఉన్నాయి.
తమలపాకు కాడలను ఉప్పు వేసి దంచి రాసుకుంటే ఒంటి నొప్పులు తగ్గుతాయి.
 
తలనొప్పి, చిగుళ్లనొప్పి, కీళ్ళనొప్పులకు తమలపాకు వాడితే ఉపశమనం లభిస్తుంది. తమలపాకు, వక్క కలిపి తింటే దగ్గు, ఆస్తమా తగ్గిస్తుంది. జలుబు, దగ్గు తగ్గాలంటే 2 కప్పుల నీళ్ళలో 8 తమలపాకులు వేసి మరగపెట్టి ఒక కప్పు కషాయం తయారయ్యాక సేవించాలి. ఐరన్‌, క్యాల్షియం ఉండటం వల్ల పాలిచ్చే తల్లులకు మేలు చేస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు