నేటి తరం యువత ఫాస్ట్ ఫుడ్‌కు బాగా అలవాటుపడింది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో లభించే ఫ్రైడ్ రైస్, చికెన్, మటన్, ఎగ్ అంటూ రాత్రిపూట అధికంగా లాగించే యువకుల్లో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాత్రిపూట ఆమ్లెట్ తీసుకుంటే అంత సులువుగా జీర్ణం కాదు. అందుకే ఉడికించిన కోడిగుడ్లను ఉదయం లేదా మధ్యాహ్నం పూట తినాలి. రాత్రిపూట మాంసాహారాన్ని తీసుకోవడం చాలామటుకు తగ్గించడం మంచిది. ఇలా చేస్తే మూడు పదుల్లో డయాబెటిస్, ఒబిసిటీ వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఒకవేళ రాత్రిపూట మాంసాహారం తీసుకోవాల్సి వస్తే మోతాదుకు మించకుండా తీసుకోవాలి.
చికెన్ అయితే అరకప్పు, గుడ్డు తీసుకోవాల్సి వస్తే తెల్లసొన మాత్రం ఆమ్లెట్ వేసి తీసుకోవాలి. ఎందుకంటే కోడిగుడ్డులో పసుపు సొనలో కొవ్వు అధికంగా వుంటుంది. దీన్ని రాత్రి పూట తినడం మానేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అదే ఉదయం పూట కోడిగుడ్డు ఆమ్లెట్ తీసుకుంటే ఆ రోజుకు కావలసిన శక్తిని ఇస్తుంది. ఇందులోని పీచు బరువును తగ్గిస్తుంది. ఇంకా ఒబిసిటీకీ దూరంగా వుండాలంటే కోడిగుడ్డులోని తెల్లసొనను మాత్రమే వంటల్లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.