మహిళ ఉద్యోగినులకు ఎదురయ్యే మెుదటి సమస్య వర్క్‌లైఫ్ బ్యాలెన్సింగ్. అంటే అటు ఇంటికి కావలసినవి చేయాలి.. ఇటు వర్క్ బ్యాలెన్స్ చేయాలి. ఈ రెండింటి మధ్యలో మహిళలు సతమతమవుతుంటారు. కొందరు మహిళలకు వీటి గురించి అసలు తెలియదు. దీంతో తీవ్రమైన అలసట, ఒత్తిడికి లోనవుతుంటారు. వీటి నుండి విముక్తి చెందుటకు ఈ పరిష్కాల మార్గాలు తెలుసుకుంటే చాలు..
మీకున్న కోరికలు, ఆలోచనలు, లక్ష్యాలు బాగానే ఉండొచ్చు. కానీ అవి జరగాలంటే వాటి గురించి ఇతరులకు చెప్పుకుంటే మంచిది. అలానే ఇంటిపరంగా మీకున్న ఇబ్బందులను వర్క్ ప్లేస్‌లో చెప్పుకుంటేనే మీరేమనుకుంటున్నారనే విషయం అటు ఇంట్లో, ఇటు ఆఫీసులో తెలుస్తుంది. అప్పుడే మీరు చేసే పని ఏమిటనే విషయం మీరు తెలుసుకుంటారు.