చర్చలను మళ్లీ కొనసాగించాలని లేఖలో కోరారు. ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదనపై తొలుత సానుకూలంగా స్పందించిన భారత ప్రభుత్వం న్యూయార్క్‌లో ఇరుదేశాలు భారత్, పాక్ విదేశాంగ మంత్రులు భేటీ అయ్యేందుకు అంగీకారం తెలిపింది.
కానీ కాశ్మీర్ సరిహద్దుల్లో ఓ బీఎస్‌ఎఫ్ జవాన్, ముగ్గురు ఎస్పీవోలను పాక్ దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో పాక్‌తో చర్చలెలా జరుపుతామంటూ భారత ప్రభుత్వం తెగేసి చెప్పింది. దీంతో పాకిస్థాన్ చర్చలకు భారత్ నో చెప్పినందుకు ఇమ్రాన్ ఫైర్ అయ్యారు. చర్చలకు సిద్ధమన్న తమ ప్రతిపాదనను తిరస్కరించడం నిరాశకు గురిచేసిందన్నారు.