టీ తాగండి.. డయాబెటిస్‌ను దూరం చేసుకోండి..

శుక్రవారం, 31 మార్చి 2017 (15:10 IST)
టీ తాగండి.. డయాబెటిస్‌ను దూరం చేసుకోండి అంటున్నారు.. ఆసియా ఫసిఫిక్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రీషన్ సెంటర్ పరిశోధకులు. రోజుకు రెండు కప్పులు టీ తాగడం ద్వారా పెద్దల్లో గ్లూకోజ్ స్థాయుల్ని తగ్గించుకోవచ్చునని తద్వారా మధుమేహాన్ని తరిమికొట్టవచ్చునని వారు సూచిస్తున్నారు. మధుమేహంతో బాధపడుతున్నవారు కూడా రోజుకు రెండు కప్పుల టీ సేవించడం ద్వారా గ్లూకోజ్ స్థాయులు తగ్గుతాయని అంటున్నారు. 
 
తేయాకులోని సహజ సిద్ధమైవ కాంపౌండ్లు, పోలిపెనాల్స్ ఉండటం ద్వారా ఇవి పెద్దల్లో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుముఖం పడతాయి. అందుకే రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించుకోవాలంటే.. పంచదారను పూర్తిగా తగ్గించుకుని తీసుకోవడం మంచిది. నీరు తీసుకున్న తర్వాత టీ తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని డాక్టర్ టిమ్ బాండ్ (టీ అడ్వైజరీ ప్యానెల్) తెలిపారు. ఆహారంలో కార్బొహైడ్రేడ్లు ద్వారా గ్లూకోజ్ స్థాయులు పెరుగుతాయి. అదే టీ తాగితే గ్లూకోజ్ స్థాయులు కరిగిపోతాయని.. దీంతో మధుమేహం నయం అవుతుందని బాండ్ చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి