మునగాకు రసాన్ని తాగితే వృద్ధాప్యం కారణంగా శరీరంపై వచ్చే ముడతలు పోతాయి. యాంటీ ఏజింగ్ గుణాలు ఈ ఆకుల్లో పుష్కలంగా ఉన్నాయి. మునగ చెట్టు ఆకులను ఎండబెట్టి పొడి చేసుకుని.. ప్రతిరోజూ ఆరు గ్రాముల మోతాదులో ఉదయాన్ని పరగడుపున తీసుకోవాలి. ఇలా చేస్తే మధుమేహం ఉన్నవారి రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. షుగర్ కంట్రోల్ అవుతుంది. మునగాకులో సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్ గుణాలు ఉన్నాయి.
ఈ ఆకులకు చెందిన రసాన్ని నిత్యం కొంత మోతాదులో తాగుతున్నట్టయితే రక్తం శుద్ధి అవుతుంది. చర్మ సంబంధ సమస్యలు కూడా నయమవుతాయి. ఇక మునగాకు కంటికి ఎంతో మేలు చేస్తాయి. కొన్ని మునగ ఆకులను తీసుకుని పేస్ట్‌లా చేసి దానికి కొంత తేనెను కలిపి కంటి రెప్పలపై పెట్టుకుంటే నేత్ర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. దృష్టి బాగా ఉంటుంది. కంటి వాపు కూడా తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.