మెరిసే చర్మ సౌందర్యం కోసం డార్క్ చాక్లెట్లు తినండి..

మంగళవారం, 17 అక్టోబరు 2017 (14:13 IST)
డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా చర్మ సౌందర్యానికి కూడా డార్క్ చాక్లెట్ సూపర్‌గా పనిచేస్తుంది. మెరిసే, మృదువైన చర్మం కోరుకునే వారు తప్పకుండా డార్క్ చాక్లెట్లు తీసుకోవాలి. అలాగే డార్క్ చాక్లెట్లు దంతాలకు మేలు చేస్తాయి. చాక్లెట్లలోని టానిన్లు దంతాలను త్వరగా పాచి పట్టనీయవు. చాక్లెట్లు తింటే పళ్లు పుచ్చిపోతాయనేది కేవలం అపోహ మాత్రమే.
 
యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే డార్క్ చాక్లెట్లు తింటే అధిక రక్తపోటును దూరం చేస్తుంది. మానసిక ఉద్వేగాలను దూరం చేస్తుంది. చాక్లెట్ల వినియోగంతో రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ అదుపులో ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ పెరిగి హృదయ సంబంధిత వ్యాధులు దరిచేరవు. రోజూ ఒకటి లేదా రెండు డార్క్ చాక్లెట్లను తింటే లోబీపీ దరిజేరదు. డార్క్ చాక్లెట్లలో ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, పీచు పుష్కలంగా వున్నాయి. అందుచేత రోజూ 30 గ్రాములకు మించకుండా డార్క్ చాక్లెట్ తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు