ఖర్జూరం తీసుకునే పురుషుల్లో ఆ సామర్థ్యం పెరుగుతుందట..

సోమవారం, 27 మే 2019 (19:43 IST)
ఖర్జూరంలో ఫైబర్, పీచు పుష్కలంగా వుంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఖర్జూరంలో సుక్రోజ్‌, ఫ్రక్టోజ్‌, గ్లూకోజ్‌ చక్కెరలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు రక్త సరఫరాలో అడ్డంకులు ఏర్పడకుండా చూస్తాయి. రక్తనాళాల్లో చేరిన కొలెస్ట్రాల్‌ను తొలగించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.


ఖర్జూరంలోని ఐసోఫ్లేవనాయిడ్స్‌ గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడతాయి. శరీర అవయవాల పనితీరుకు కావలసిన క్యాల్షియం, ఐరన్ వీటిల్లో ఎక్కువగా వుంటాయి.
 
ఖర్జూరంలోని పొటాషియం రక్తపీడనాన్ని అదుపులో ఉంచుతుంది. వీటిలోని ఫైబర్‌ రక్తంలో చక్కెర నిల్వలు పెరగిపోకుండా చూస్తుంది.

ఎండు ఖర్జూరాలను తీసుకుంటే పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. గర్భం దాల్చిన మహిళలకు ఎక్కువ శక్తి అవసరం. వారికి కావలసిన క్యాలరీలు, పోషకాలు ఖర్జూరంలో లభిస్తాయని వైద్యులు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు