బీఆర్ఎస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కవిత వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. వాళ్లని వాళ్లే కడుపులో కత్తులతో కౌగిలించుకుంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కుటుంబ గొడవల్లో తనని తీసుకురావద్దని సూచించారు. హరీశ్ రావు, సంతోష్ రావుల వెనుక తానున్నననే వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ఖండించారు. విపరీతంగా అవినీతి సొమ్ము సంపాధించారు. అందుకే కల్వకుంట్ల కుటుంబంలో వాటాల కోసం వివాదాలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. పాపం ఊరికే పోదు.. చేసుకున్న వారికి చేసుకున్నంత అని విమర్శించారు.