పాలలో శొంఠి కలిపి తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

సిహెచ్

సోమవారం, 22 జనవరి 2024 (16:38 IST)
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన శొంఠి పొడిని పాలతో కలిపి తీసుకుంటే మంటను తగ్గిస్తుంది, వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొద్దిగా ఉప్పుతో శొంఠి పొడిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంకా శొంఠి పాలతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. గ్లాసు వేడి పాలలో కొద్దిగా శొంఠి పొడి కలిపి తాగితే జలుబు, దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.
 
శొంఠి పాలు తాగడం వల్ల గ్యాస్, అజీర్ణం, అపానవాయువు, ఇతర కడుపు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు శొంఠి పాలు తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శీతా కాలంలో కొందరికి కీళ్ల నొప్పులు ఇబ్బందులు పెడతాయి, అలాంటివారు శొంఠి పాలు తాగితే ప్రయోజనకరంగా ఉంటాయి.
 
శొంఠి పాలలో క్యాల్షియం, విటమిన్ డి ఉన్నాయి, ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి, పాలలో శొంఠి పొడిని కలిపి త్రాగవచ్చు. రక్తపోటుతో బాధపడుతుంటే, శొంఠి పొడి పాలు తాగితే అది అదుపులో ఉంచుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు