రోజూ ఉదయం పూట లేవగానే పరగడుపున ఈ పదార్థాలను తీసుకోవడం ద్వారా మానసిక ఉత్సాహంతో పాటు ఆరోగ్యం చేకూరుతుంది. ఉదయం పూట పరగడుపున రెండు గ్లాసుల గోరు వెచ్చని నీటిని సేవించడం ద్వారా బరువు తగ్గుతుంది. శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం యవ్వనంగా తయారవుతుంది. అజీర్తి సమస్యలు వుండవు.
మెంతులను నానబెట్టిన నీరు లేకుంటే, జీలకర్ర నానబెట్టిన నీటిని రోజూ తీసుకుంటే లేదా పరగడుపున తీసుకుంటే.. రక్త ప్రసరణ మెరుగ్గా వుంటుంది. మొలకెత్తిన ధాన్యాల్లో ధాతువులు, ప్రోటీన్లు పుష్కలంగా వుంటాయి. ఇందులోని యాంటీ -యాక్సిడెంట్లు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. రక్తంలోని కొవ్వును నియంత్రిస్తాయి. హృద్రోగాలను దూరం చేస్తాయి.
బరువును తగ్గిస్తాయి. పరగడుపున క్యారెట్, ముల్లంగి, కీరదోసకాయ ముక్కులను తీసుకోవచ్చు. ఇంకా తాజా పండ్ల రసాన్ని కూడా తీసుకోవచ్చు. రోజూ పరగడుపున కివీ, ఆపిల్, పుచ్చకాయ, స్ట్రాబెర్రీ, బొప్పాయి వంటి పండ్ల ముక్కలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారు. కానీ ఆరెంజ్, అరటి పండ్లను మాత్రం పరగడుపున తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.