తాజా పండ్లు, కూరగాయలు, పాలు, ప్రొటీన్లు ఉన్న ఆహారాన్ని మాత్రమే హుంజాలు తింటారు. నిల్వ ఆహార పదార్థాలను అసలు ముట్టుకోరు. రోజుకు 2వేల కేలరీలకు మించి ఆహారం తీసుకోరు.
పండ్లలో ముఖ్యంగా ఆప్రికాట్‌ను ఎక్కువగా తీసుకుంటారు. ఈ పండులో ఉండే విటమిన్ బీ-17కు కేన్సర్ వ్యాధిని నిరోధించే లక్షణం ఉంది. అందుకే హుంజాలకు కేన్సర్ అంటే తెలియదు. ఒక్కోసారి రెండు మూడు నెలలపాటు ఆహారాన్ని మానేసి ఆప్రికాట్ పండ్ల నుంచి తీసిన రసాన్ని ఎక్కువగా తాగుతుంటారు. ఇది వారికి సంప్రదాయంగా వస్తున్న ఆచారం. ఇప్పటికీ ఈ ఆచారాన్ని కొనసాగిస్తుంటారు.