మంచినీళ్లు అనుకుని సలసలలాడే టీని తాగేశాడు, మృతి చెందాడు

ఐవీఆర్

శనివారం, 11 అక్టోబరు 2025 (19:17 IST)
అనంతపురం జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకున్నది. మంచినీళ్లు అనుకుని సలసలలాడే వేడి టీని గటగటా తాగేశాడు ఓ బాలుడు. దాంతో అతడు ఆ వేడి టీ గొంతులోకి వెళ్లడంతో విలవిలలాడుతూ స్పృహ తప్పి కిందపడిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. అనంతపురం జిల్లా యాడికి ప్రాంతానికి చెందిన రామస్వామి, చాముండేశ్వరిలకు నాలుగేళ్ల కుమారుడు, ఏడాదిన్నర పాప వున్నారు. రెండు రోజుల క్రితం వారి బాబు హృతిక్ బైట నుంచి వచ్చి ఫ్లాస్కులో వున్న వేడి టీని మంచినీళ్లు అనుకుని గటగటా తాగేసాడు. గొంతు మండిపోవడంతో పెద్దగా ఏడవసాగాడు. గమనించిన తల్లి అతడు టీ తాగినట్లు గమనించి సమీపంలోని తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. ఐతే బాబు పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు