ఆ ఫుడ్ తింటే సంసారానికి పనికిరారా?

సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (17:40 IST)
హెల్తీ డైట్ అనేది కేవలం గుండెకు, బ్రెయిన్‌కు మాత్రమే కాదు శృంగారానికి కూడా మంచిదని రీసెర్చర్స్ చెబుతున్నారు. 19 ఏళ్ల సగటు వయస్సున్న 2 వేల 900 మందిపై జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. చేపలు, చికెన్, కూరగాయలు, పండ్లు, నీళ్లు ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకునే వారిలో సంతాన సాఫల్యత ఎక్కువగా కనిపించిందట. 
 
అవి కాకుండా పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, బీఫ్, స్నాక్స్, పాలిష్ చేసిన బియ్యం, షుగరీ బేవరేజెస్, స్వీట్స్ తినే వారిలో తక్కువగా ఉన్నట్లు తేలిందట. ప్రస్తుత జనరేషన్లో దొరికే ఫుడ్‌ను బట్టి పోకడ సాగిస్తున్నారని.. హెల్తీ డైట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలియాలని పరిశోధనలు జరిపారు. హెల్తీ డైట్ తీసుకునే వారిలో సాఫల్యత బాగా వుంటున్నట్లు ఫలితం వచ్చింది. 
 
సాఫల్యత తక్కువ ఉండటం వల్ల భాగస్వామి ప్రెగ్నెన్సీ అవడం ఆలస్యం అవుతుంది. కొన్ని సార్లు గర్భం దాల్చడం కూడా అనుమానమే. అందుకే మగాళ్లు హెల్తీ డైట్ మెయింటైన్ చేయడం తప్పనిసరి. డైట్ ప్రకారం.. మగాళ్ల గుండె, మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయనేది పాత మాట. వాటితో పాటు సాఫల్యత మీద ప్రభావం చూపిస్తాయనేది కొత్త రిజల్ట్. స్మోకింగ్, రేడియేషన్, పెస్టిసైడ్స్, హెవీ మెటల్స్ బంగారం, స్టీల్ చైన్లు, వెండి వస్తువులు భారీగా వేసుకుని తిరగడం వంటివి చేస్తే అది కూడా ప్రతికూల ఫలితాలనిస్తుందట. 
 
అండోత్పత్తి కోసం మహిళలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే కాదు, అసలు అండంతో ఫలదీకరణం జరగాలంటే వీర్య కణాల సంఖ్య కూడా ఎక్కువ సంఖ్యలో ఉండాలి. అది ఏమాత్రం తగ్గినా గర్భం దాల్చేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. కనుక ఆరోగ్యకరమైన ఆహారం ఎంతో ముఖ్యమని చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు