యాలకులు టీ తాగితే.. ఏంటి లాభం?

సోమవారం, 10 ఆగస్టు 2020 (17:33 IST)
శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో యాలకులు దివ్యౌషధంగా పనిచేస్తుంది. నోటి దుర్వాసనను తగ్గించడమే కాకుండా.. నోట్లో అల్సర్లూ, ఇన్ఫెక్షన్ల లాంటివి ఉన్నప్పుడు రెండు యాలకుల్ని నోట్లో వేసుకుంటే ఆ సమస్యలు తగ్గిపోతాయి. యాలకుల్లో పీచు పదార్థం ఉంటుంది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. 
 
జలుబూ, దగ్గు వంటివి ఇబ్బంది పెడుతున్నప్పుడూ యాలకులు ఒక రూపంలో తీసుకుంటే అవి తగ్గుతాయి. యాలకులు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాదు... కాన్సర్ లాంటి వ్యాధుల్ని కూడా అడ్డుకోగలవు. 
 
డిప్రెషన్ నుంచీ బయటపడాలంటే ఏ యాలకుల టీయో, పాలో తాగితే సరి. యాలకుల్లో మెటబాలిజంను మెరుగుపరిచే గుణాలున్నాయి. ఇవి జీర్ణక్రియ చక్కగా జరిగేలా చేస్తాయి. అలాగే... కడుపులో మంట, నొప్పి వంటి వాటిని పోగొడతాయి. పొట్టలో విడుదలయ్యే బైల్ యాసిడ్‌ను యాలకులు క్రమబద్ధీకరిస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు