కనురెప్పల మీద వచ్చే చిన్న చిన్న కురుపులు రెప్పమీద ఉండి ఇబ్బందిపెడతాయి. బ్యాక్టీరియా చేరడంవల్ల గాని, కనురెప్పలమీదున్న తైలగ్రంధి నాళం మూత పడటం వల్ల గాని అలా కురుపు వచ్చినపుడు దానిమీద వేడి కాపడం పెట్టాలి. వేడి చేసిన గుడ్డను ఆ కురుపు మీద రోజులో నాలుగైదుసార్లు పెట్టాలి. ఒక చెంచా ధనియాలను ఒక కప్పు నీటిలో మరిగించి, చల్లార్చిన కషాయంతో కంటిని రోజులో నాలుగైదుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి.
4. ఒక చెంచా ఉప్పును ఒక కప్పు నీటిలో వేసి ఆ నీరు అరకప్పు అయ్యేవరకు మరిగించి, చల్లార్చి, వడకట్టిన నీటిని కంటిలో రోజుకు మూడుసార్లు చుక్కలుగా వేసుకుంటే ఉపశమనం కలుగుతుంది.