ఆదివారం రాగానే.. చికెన్, మటన్‌లు కొనిపెట్టేస్తున్నారా? సీఫుడ్ పక్కనబెట్టేస్తున్నారా..? అయితే ఇకపై చేపలే తినండి. వారానికి రెండుసార్లు చేపలు తింటే గుండెకు ఎంతోమేలు జరుగుతుంది. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా గుండెపోటు, పక్షవాతం రావని అనేక పరిశోధనల్లో తేలింది.
చేపలు తినడంతో నడుం చుట్టూ వున్న కొవ్వు కరిగిపోతుంది. కాలేయం, మెదడుకు చేపలు ఎంతో మేలు చేస్తాయి. చేపలలో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల కారణంగా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.