చేపలు తింటే.. ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (14:36 IST)
హృద్రోగ సమస్యలున్న వారు, ఆస్తమా ఇబ్బందులను కలిగివున్నవారు చేప మాంసాన్ని తనడం చాలా మంచిదని న్యూట్రీషియన్లు అంటున్నారు. చేపల ద్వారా లభించే ఎన్-3 పాలీసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ తీసుకున్న వారిలో ఆస్తమా సంబంధిత సమస్యలు చాలామటుకు తగ్గుతాయి. చేపల్లోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. 
 
అలాగే పెద్దపేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పాంక్రియాటిక్ క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. స్త్రీలలో రుతు క్రమం సరిగ్గా ఉండాలన్నా.. తరచూ చేపలను తినాలని వైద్యులు సూచిస్తున్నారు. వృద్ధాప్యం మీద పడుతున్న కొద్ది సహజంగానే మతిమరుపు వస్తుంటుంది. ఇది తీవ్రతరమై అల్జీమర్స్‌కు దారి తీస్తుంది. 
 
ఇలా ఉన్నవారు చేపలను తినడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. చేపలతో మెదడు తీరు కూడా మెరుగవుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుందని.. చేపలను వారంలో కనీసం 1 లేదా 2 సార్లు తీసుకుంటే వైద్యులు చెప్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు