చేప నూనె తగిన విధంగా నోటితో తీసుకున్నప్పుడు సురక్షితంగా ఉంటుంది. చేప నూనెను శిశువులకు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలతో వైద్యుల సూచన మేరకు వాడాల్సి వుంటుంది. కౌమారదశలో, చేప నూనెను 12 వారాల పాటు రోజూ సుమారు 2.2 గ్రాముల మోతాదులో సురక్షితంగా ఉపయోగించవచ్చని వైద్యులు చెపుతారు.
కానీ చిన్న పిల్లలు వారానికి రెండు ఔన్సుల కంటే ఎక్కువ తినకూడదు. చేపల నూనెను ఆహార వనరుల నుండి పెద్ద మొత్తంలో తినేటప్పుడు అది సురక్షితం కాదు. కొవ్వు చేపలలో పాదరసం వంటి టాక్సిన్స్ ఎక్కువగా ఉంటాయి. కలుషితమైన చేపలను తరచూ తినడం వల్ల పిల్లల్లో మెదడు దెబ్బతినడం, మెంటల్ రిటార్డేషన్, అంధత్వం, మూర్ఛలు వచ్చే అవకాశం లేకపోలేదు.
గర్భిణి, పాలిచ్చే తల్లులు చేప నూనెను వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడాలి. నెలలు నిండుతున్న సమయంలో గర్భిణీ స్త్రీలు కొన్ని రకాల చేపలకు దూరంగా వుండాలి. ఎందుకంటే వీటిలో అధిక స్థాయిలో పాదరసం ఉండవచ్చు. ఇతర చేపల వినియోగాన్ని వారానికి ఒకసారి మాత్రమే తీసుకోవాలి. ఆహార వనరులను పెద్ద మొత్తంలో వినియోగించినప్పుడు చేపల నూనె సురక్షితం కాదు. కొవ్వు చేపలలో పాదరసం వంటి టాక్సిన్స్ ఉంటాయి.
కాలేయ వ్యాధితో వున్నవారు, కాలేయ సమస్యలున్న వారిలో ఫిష్ ఆయిల్ రక్తస్రావానికి గురి చేసే అవకాశం వుంది. చేప నూనె తీసుకోవడం కొన్నిసార్లు మానసిక ఒత్తిడిని పెంచే అవకాశం వుంది. చేప నూనె అధిక మోతాదులో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణ మరింత కష్టమవుతుందని, ఫలితంగా మధుమేహులలో సమస్య తలెత్తే ఆస్కారం వుందన్న ఆందోళన ఉంది.