సజ్జలు తింటే తలనొప్పి గోవిందా..!

శనివారం, 4 జులై 2020 (15:52 IST)
సజ్జలు తింటే తలనొప్పి మటుమాయం అవుతుంది. అలాగే బాదం పప్పు, నువ్వులు, అల్లం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సజ్జల్లోని మెగ్నీషియం, రిబోఫ్లావిన్ ఎక్కువగా ఉండటం వల్ల తలనొప్పిని తగ్గించడానికి సహాయ పడుతుంది. మెగ్నీషియం మైగ్రేయిన్ తలనొప్పిని నయం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. 
 
అలాగే బాదంలో వుండే పోషకాల వల్ల రక్తనాళాలు, కండరాలకు విశ్రాంతి ఇవ్వటం ద్వారా ఒత్తిడి తగ్గించి తలనొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అరటి పండు కూడా తలనొప్పిని దూరం చేస్తుంది. ఇందులో మెగ్నీషియం, పొటాషియం సమృద్దిగా ఉండటం వల్ల హ్యాంగోవర్ కారణంగా వచ్చిన తల నొప్పిని తగ్గించడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది.
 
ఇకపోతే.. నువ్వుల్లోని ఉన్న పోషకాలు కారణంగా తలనొప్పిని తగ్గిస్తాయి. ఇందులో ఉండే ఐరన్ రక్తనాళాలను సంకోచ ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా మైగ్రేయిన్ తల నొప్పిని తగ్గిస్తాయి. అల్లంలో నొప్పిని ఉపశమనం కలిగించే లక్షణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు