కంటి ఆరోగ్యం కోసం వారానికి 2 లేదా 3సార్లు చేపల్ని..?

గురువారం, 2 జులై 2020 (19:51 IST)
కంటి ఆరోగ్యం కోసం వారానికి రెండు లేదా మూడుసార్లు చేపలు తినాలని ఆయుర్వద నిపుణులు సూచిస్తున్నారు. వర్షాకాలం చేపలు తీసుకునేముందు పసుపు, ఉప్పుతో బాగా శుభ్రం చేసుకున్నాకే వాడాలి. చేపలతో కంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ముఖ్యంగా చేపలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అందుకే చేపలు వారానికి రెండు మూడు సార్లు తీసుకోవడం మంచిది.
 
చేపలో ఉండే విటమిన్ డి కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కూరగాయలు, ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపును కాపాడతాయి. 
 
కళ్లకు వచ్చే జబ్బులను కూడా దరిచేరనీయవు. అలాగే కాయగూరల్లో క్యారెట్‌ను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. నేత్రాలకు అవసరమైన విటమిన్-ఎ, బీటాకెరొటిన్‌లు క్యారెట్‌లో లభిస్తాయి. క్యారెట్‌లో లభించే పొటాషియం, పీచుపదార్ధాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చేపతోనూ కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని వైద్యులు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు