ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

సిహెచ్

శుక్రవారం, 24 మే 2024 (21:53 IST)
లివర్ లేదా కాలేయం. శరీరంలోని ఈ అవయవం 300 కంటే ఎక్కువ విభిన్న విధులను నిర్వహిస్తుంది, కాబట్టి దాని ఆరోగ్యం కోసం ఎంతో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా వుంటుందో తెలుసుకుందాము.
 
వెల్లుల్లిలో సెలీనియం ఉంటుంది, ఇది కాలేయం నుండి విషాన్ని బయటకు పంపుతుంది.
బీట్‌రూట్ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది, ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
బెర్రీస్ కాలేయ కణాలు, ఎంజైమ్‌లు దెబ్బతినకుండా కాలేయాన్ని రక్షించడమే కాక కొవ్వు కాలేయం నుండి వ్యర్థాన్ని తొలగిస్తాయి.
డాండెలైన్ టీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుండటంతో ఇది కాలేయ సమస్యను నయం చేస్తుంది.
ఆకుపచ్చ కూరగాయల్లో కాలేయాన్ని నిర్విషీకరణ చేసే ఐరన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, గ్లూకోసినోలేట్‌లు ఉంటాయి.
సిట్రస్ పండ్లలో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
పసుపు వల్ల వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా కాలేయ వ్యాధులను నివారిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు