లో డెన్సిటీ లిపోప్రోటీన్ (ఎల్‌డీఎల్), దీనినే సాధారణ భాషలో చెడు కొలెస్ట్రాల్ అంటారు. ఇది మన శరీరంలో ఎక్కువగా ఉంటే అనేక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా ముఖ్యంగా గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అందుకే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్)ను తగ్గించుకొని, మంచి కొలెస్ట్రాల్ (హై డెన్సిటీ లిపోప్రోటీన్ లేదా హెచ్‌డీఎల్)ను పెంపొందించుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే క్రింద సూచించిన పలు ఆహారాలను నిత్యం తీసుకుంటూంటే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దామా..!
4. జామ: జామ పండ్లలో ఉండే విటమిన్ సి, పాస్ఫరస్, నికోటిన్ యాసిడ్, ఫైబర్‌లు శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసి, కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి.
5. పుట్టగొడుగులు: పుట్టగొడుగుల్లో విటమిన్ బి, సి, కాల్షియం, ఇతర మినరల్స్ ఉండడంతో ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.