వెల్లుల్లి రెబ్బల్ని బాగా దంచుకుని వేడినీటిలో వేసుకుని తరచూ తీసుకోవడం వల్ల రక్తం శుభ్రపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. తరచూ జలుబూ, జ్వరాలకు గురయ్యేవారు వెల్లుల్లిని రోజూ తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. రెండు, మూడు వెల్లుల్లి రెబ్బలూ, తేనె, అల్లం కలిపి ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
వెల్లుల్లి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. రోజూ ఒక కప్పు వెల్లుల్లి టీని తాగితే శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు, జలుబు, జ్వరం తగ్గిపోతాయి. వెల్లులిని తరచూ తీసుకోవడం వల్ల రొమ్మూ, ఉదర, మూత్రాశయ క్యాన్సర్లు రాకుండా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.