వెల్లుల్లిని రోజూ పరగడుపున తీసుకుంటే.. పలు సమస్యలను దూరం చేసుకోవచ్చు. తేనేతో కలిపి వెల్లుల్లి రసాన్ని తీసుకుంటే బాడీలోని బ్యాక్టీరియా, వైరస్‌లను సులభంగా తొలగించుకోవచ్చు. రోజు వెల్లుల్లిని తీసుకోవడం వలన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తీసుకోవడం వలన కడుపులో ఉండే హానికారక బ్యాక్టీరియా సమస్య నుంచి బయటపడొచ్చు. అలాగే న్యూమోనియా సమస్య కూడా తగ్గుతుందట. అంతేకాకుండా. జ్వరం, ఉబ్బసం, కాలేయ సమస్యలకు కూడా వెల్లుల్లి తీసుకోవడం వలన వీటిని రాకుండా చేసుకోవచ్చు.
ఇంకా హైబీపీ సమస్య ఉన్నవాళ్ళు వెల్లుల్లి తీసుకోవడం వలన ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే గుండె సంబంధింత సమస్యలను వెల్లుల్లి నివారిస్తుందట. ఛాతీ సంబంధిత సమస్యల భారిన పడకుండా వెల్లుల్లి రక్షిస్తుంది. శరీరంలో వాపులు, నొప్పులు ఉన్నచోట వెల్లుల్లి రసంతో మర్ధన చేస్తే ఆ సమస్యలు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.