రోజుకో స్పూన్ నెయ్యిని ఆహారంలో చేర్చుకోవడం మంచిదేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నెయ్యి పేగుల్లో ఉండే కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తుంది. ఇందులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. కొవ్వులో కరిగే విటమిన్‌లైన ఎ, డి, ఇ, కె నెయ్యిలో అధిక పరిమాణంలో ఉంటాయి. ఇవి మెదడు, గుండె, ఎముకల పనితీరును మెరుగుపరుస్తాయి.
పాల ఉత్పత్తుల్లో ఒకటైన నెయ్యిని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. నెయ్యి శక్తినిస్తుంది. అందుకే రోజుకో స్పూన్ మోతాదులో పెద్దలు నెయ్యిని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. ఇక పిల్లలకైతే రాత్రిపూట కాకుండా ఉదయం, మధ్యాహ్నం పూట భోజనంలో నెయ్యిని రెండు స్పూన్ల మేర వాడితే మంచి ఫలితం వుంటుంది.
నెయ్యిలో ఉండే బ్యూటరిక్ యాసిడ్, కడుపులో ఆమ్లాలను ఉత్పత్తి చేసి జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. జీర్ణక్రియకు అవసరమయ్యే ఆమ్లాలను స్రవించేలా శరీరాన్ని ప్రోత్సహిస్తుంది. నెయ్యిలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.