రుతుక్రమ రుగ్మతలకు చెక్ పెట్టాలంటే.. 2 నుంచి 3 సార్లు అల్లం టీ తాగండి!

సోమవారం, 4 జులై 2016 (11:00 IST)
రుతుక్రమ సమయంలో స్త్రీలలో ఏర్పడే రుగ్మతలను తొలగించుకోవాలంటే.. అల్లాన్ని ఉపయోగించండి. రుతుక్రమం సమయంలో ఏర్పడే మోకాళ్ల నొప్పులు, కడుపునొప్పిని తగ్గంచుకోవాలంటే అల్లం టీ తాగడం మంచిది. రుతుక్రమ సమయంలో స్త్రీలలో ఏర్పడే రుగ్మతలు తీవ్రమైన సమస్యలకు గురి చేస్తాయి.

వీటిని తొలగించుకునేందుకు శక్తివంతమైన వైద్య గుణాలను కలిగి ఉండే అల్లం టీ బెస్టుగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. రుతుక్రమ సమయంలో ఏర్పడే సమస్యలు, కడుపులో కలతలతో బాధపడుతుంటే.. రోజులో 2 నుండి 3 సార్లు అల్లం టీ తాగటం వలన రుతుక్రమ తిమ్మిరుల నుండి ఉపశమనం పొందవచ్చు.
 
అల్లం టీ ఎలా తయారు చేయాలంటే.. అల్లాన్ని వేరును కడిగి.. తోలును తీసేయాలి. ఆ తరువాత వేరును చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించాలి. ప్రతి రెండు కప్పుల నీటికి రెండు చెంచాల శుభ్రపరచిన అల్లం వేరును కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న కుండలో, తక్కువ వేడి వద్ద, కొద్ది నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఇపుడు మీకు కావలసిన టీ తయారైంది. ఈ మిశ్రమాన్ని వడపోసి ద్రావణంగా తీసుకోవాలి. ఇలా తయారు చేసిన వేడి అల్లం టీని తాగటం వలన రుతుక్రమ అసౌకర్యాల నుంచి పది నిమిషాల్లో ఉపశమనం పొందవచ్చు. 

వెబ్దునియా పై చదవండి