అల్లం నీరు. అల్లం నీరు తాగితే జీర్ణ సమస్యలు తొలగుతాయి. పరగడుపున అల్లం నీరు తాగితే కలిగే లాభాలు, నష్టాలు వున్నాయి. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో అల్లం ముక్కను నమలడం లేదా అల్లం నీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ఈ నీటిని తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ తొలగిపోతాయి.
పీరియడ్స్ సమయంలో అల్లం ముక్కను నమలడం వల్ల నొప్పి, తిమ్మిరి తగ్గుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం తీసుకుంటే, చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.